సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..జనసేనకు మరో కీలక పదవి?
ఏపీలో ఈ ఏడాది జరిగన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, రాష్ట్రంలో టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నూతన ప్రభుత్వంలో కొత్త మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాల్లో ఘన విజయం సాధించింది.
వివారల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మరో కీలక పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సముచిత స్థానం కల్పించారు. మూడు మంత్రి పదవులు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేశారు. అలాగే..పర్యావరణ అభివృద్ధి, పంచాయిత్ రాజ్, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి పదవులు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చారు.
ఈ క్రమంలోనే మరో కీలకమైన బాధ్యతను జనసేన నేతలకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ రేసులో తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. చివరి నిమిషంలో లోకం మాధవి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది.