ఏపీలో నదుల అనుసంధానంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్‌

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలోని సచివాలయంలో నదుల అనుసంధానంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Update: 2024-12-30 11:36 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు(CM Chandrababu') నాయుడు రాజధాని అమరావతి(Amaravati)లోని సచివాలయంలో నదుల అనుసంధానం(Linkage of rivers)పై ప్రజెంటేషన్‌(Presentation) ఇచ్చారు. అనంతరం సీఎం అధికారులతో మాట్లాడుతూ.. నదుల అనుసంధానం చేస్తేనే రాష్ట్రానికి ఉపయోగంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఇప్పటికే కృష్ణా, గోదావరితో పాటు ఇతర రాష్ట్రాలపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు వేర్వేరు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిర్మించుకున్నారని, మనం కేవలం ఈ ప్రాజెక్టు ద్వారా చిట్టచివరకు వచ్చిన వరద జలాలను ఇతర నదులకు తరలిస్తామని.. దీంతో ఏ రాష్ట్రంతో నీటి సమస్య ఉండదని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అలాగే స్వర్ణాంధ్ర-2047 లో నీటి వనరులకు ప్రాధాన్యత ఇచ్చామని నొక్కి చెప్పారు.

రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులను టీడీపీనే ప్రారంభించిందని తెలుగు గంగ(Telugu Ganga) ద్వారా నీళ్లు తీసుకొచ్చానమని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు లేకపోవడం వల్ల.. ఉత్తరాంధ్ర(Uttarandhra)లో నీటి సమస్య ఉందిని.. త్వరలో ఏపీని కరువు రహితం(Drought free)గా మారుస్తామని సీఎం చంద్రబాబు అధికారులతో చెప్పుకొచ్చారు. అలాగే నదులు అనుసంధానం చేయగలిగితే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని.. బనకచర్ల ప్రాజెక్టు(Banakacherla project) వల్ల రాష్ట్రం మొత్తం అనుసంధానం అవుతుందని. తెలుగు తల్లికి జలహారతి(Jalaharathi for Telugutalli) పేరుతో ఈ బనకచర్ల ప్రాజెక్టు ఉండబోతోందని.. ఇది రాయలసీమకు గేట్‌ వే అవుతుందన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. రాయలసీమలో ప్రతి ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి ఉంటుందని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.


Similar News