AP Politics:వైసీపీకి చెక్ పెట్టేలా..సీఎం చంద్రబాబు ప్లాన్!?

ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగోసారి సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-07-12 09:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో నాలుగోసారి సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరేలా ప్రజా అభివృద్ధి పై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గత వైసీపీ హయాంలో ప్రజలు నష్టపోయారని ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే రాష్ట్రంలో శాసనసభలోని ఏ బిల్లు అయినా సులభంగా పాస్ చేసుకునే బలం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ బిల్లులకు శాసన మండలిలో కూడా ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. దీంతో కూటమి నేతలు శాసనమండలిలోనూ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోన్నారు. పలువురు వైసీపీ ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఘోర ఓటమి వల్ల విసుగు చెందిన పలువురు పార్టీ నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News