Heavy Rain Effect:‘రేపు స్కూళ్లకు సెలవు ఇవ్వాలి’.. సీఎం చంద్రబాబు ఆదేశం

ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

Update: 2024-09-01 10:49 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు గ్రామాలను వరదలు ముంచెత్తాయి. దీంతో సీఎం చంద్రబాబు భారీ వర్షాల పై నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సీఎం అధికారులకు సూచించారు. ఈ క్రమంలో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు రేపు సెలవు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల్లో 9 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే చాలా వరకు వర్షాలు తగ్గాయని, కానీ వరద ముప్పు ఉందని చెప్పారు. ఎల్లుండి లోగా వర్షాలు తగ్గుతాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైందని, 37 సెం.మీ వరకు వర్షం కురిసిందని సీఎం తెలిపారు.


Similar News