Free Gas Cylinder: పెట్రోలియం సంస్థలకు చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు

ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం. అందుకు ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు నాయుడు పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

Update: 2024-10-30 09:12 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీల్లో ఒకటైన ఫ్రీ గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. అందుకు ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పెట్రోలియం సంస్థలకు అందజేశారు. హిందుస్థాన్ పెట్రోలియం (Hindustan Petrolium), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (Bharat Petrolium Corporation), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil Corporation) సంస్థల ప్రతినిధులకు సచివాలయంలో (AP Secretariat) లో మొదటి ఉచిత సిలిండర్లకు అయ్యే రూ.894 కోట్ల చెక్కును అందజేశారు.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీపం -2 పథకంలో భాగంగో 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున అర్హులైన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ ను అందించనుంది కూటమి సర్కార్. ఈనెల 29 నుంచే బుకింగ్స్ మొదలవ్వగా.. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లో లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము తమ ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Tags:    

Similar News