CM Chandrababu:నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చలు

స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్(vision document) రూపకల్పన పై ఏపీ సచివాలయం(AP Secretariat)లో నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) సమావేశమయ్యారు

Update: 2024-10-30 11:45 GMT

దిశ,వెబ్‌డెస్క్: స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 విజన్ డాక్యుమెంట్(vision document) రూపకల్పన పై ఏపీ సచివాలయం(AP Secretariat)లో నీతి ఆయోగ్ (NITI Aayog) ప్రతినిధులు, పలు రంగాల నిపుణులతో సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) సమావేశమయ్యారు. విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈవో సుబ్రహ్మణ్యం(CEO Subrahmanyam) చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రధానంగా మాట్లాడారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందించినట్లు సీఎం చంద్రబాబు వివరించారు.

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ అభివృద్ధే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ (NITI Aayog) సీఈవోకు వివరించారు. ఈ సమావేశంలో నీతి అయోగ్‌కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News