ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు.

Update: 2024-07-04 05:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుధవారం ఏపీ క్యాపిటల్ అమరావతి పై శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధానిని నిర్మిస్తామని అధికారులతో స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన రాజధాని, పోలవరం డ్యాం, ఇతరు నిధులు, సమస్యలకు సంబంధించిన అంశాలపై ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ 16 స్థానాలతో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీగా భారీ ఎత్తున సపోర్ట్ దక్కుతుందని ఏపీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


Similar News