విద్యుత్ పోరాట అమరవీరులకు సీఐటీయూ నివాళులు

గత పద్నాలుగేళ్ళ క్రితం విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీసు తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు.

Update: 2024-08-28 09:26 GMT

దిశ,కాకినాడ:గత పద్నాలుగేళ్ళ క్రితం విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీసు తూటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిలకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణల్లో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగుంపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దువ్వ శేషా బాబ్జి, చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మాలకా రమణ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యమం ఫలితంగా 15 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా విద్యుత్ ధరలు పెంచేందుకు సాహసించలేదని తెలిపారు. ఈ విద్యుత్ పోరాటం సందర్భంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సిఐటియు కార్యకర్తలు అమరులయ్యారని గుర్తుచేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్తు ధరల పెరుగుదలను వ్యతిరేకించిన ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు నేడు అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడవక ముందే యూటర్న్ తీసుకుని ప్రజల పై విద్యుత్ భారం మోపేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. అదాని కంపెనీ నుండి స్మార్ట్ మీటర్లు రాష్ట్రానికి చేరుకున్నాయని, ప్రయోగాత్మకంగా ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల్లో బిగించిన స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేయడాన్ని గుర్తుపెట్టుకోవలన్నారు. తక్షణం స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, ఉపాధ్యక్షురాలు ఎరుబండి చంద్రావతి, రూరల్ కన్వీనర్ టి.రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకట రమణ, అంగన్వాడి సంఘం జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, నాయకులు దాడి బేబీ, ధనలక్ష్మి, సునీత, ఎస్తేరు రాణి, తులసి, వీరమణి, నీరజ, రత్న కుమారి, రామలక్ష్మి, నాగమణి, బెన్నాయమ్మ తదితరులు పాల్గొన్నారు.


Similar News