క్వశ్చన్ అవర్ స్టార్ట్.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోన్న సీఐడీ అధికారులు..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును రెండవ రోజు సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలులో

Update: 2023-09-24 06:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును రెండవ రోజు సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉదయం 9.30 నుండి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. బాబు తరుఫు లాయర్ల సమక్షంలో సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. నిన్న చంద్రబాబును దాదాపుగా 50 ప్రశ్నలు అడగగా.. ఆయన కొన్నింటికి సమాధానాలు దాట వేసినట్లు సమాచారం. ఆ ప్రశ్నలతో పాటు ఇవాళ మరో 50 క్వశ్చన్స్ అధికారులు రెడీ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ కేసులో 140 మంది సాక్ష్యుల నుండి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా బాబుపై సీఐడీ అధికారులు ప్రశ్నలు సందిస్తున్నట్లు సమాచారం. శనివారం విచారణ 30 శాతం పూర్తి అవడంతో.. ఈ స్కామ్‌కు సంబంధించి మిగిలిన సమాచారం రాబట్టడం కోసం ఇవాళ చంద్రబాబుపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై గంటపాటు ప్రశ్నల వర్షం కురిపించిన అనంతరం అధికారులు రూల్‌లో భాగంగా ఆయనకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. అనంతరం మళ్లీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.

ఇవాళ 5 గంటలకు చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుండటంతో వీలైనంతా సమాచారం గుంజేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు టాక్. కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబును వర్చువల్‌గా సీఐడీ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా ఇవాళ్టితో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియనుండటంతో కోర్టు నిర్ణయం‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read More:   స్కిల్ స్కామ్ కేసులో జగన్‌ది పైశాచిక ఆనందమే: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

సీఎం జగన్‌కు నాలుగు సీట్లు కూడా రావడం కష్టమే.. బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News