Tirumala: జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవల రద్దు

బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవలపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు..

Update: 2023-06-04 10:58 GMT

దిశ, తిరుపతి: బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవలపై ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఈ సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలు, సుప్రభాత సేవలను జులై 15 వరకు రద్దు చేసింది.

బ్రేక్ దర్శనాలపై పరిశీలన

వేసవి ప్రారంభం అయిన తరువాత సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులపై టీటీడీ నిర్ణయం తీసుకుంది. బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు చేశారు. ఇదే విధానం మరి కొంత కాలం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మార్పు వలన సాధారణ భక్తులకు దర్శనం వేగంగా జరిగే అవకాశం ఏర్పడిందని టీటీడీ చెబుతోంది.

Tags:    

Similar News