తిరుపతిలో దొంగ ఓట్లు.. పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది....
దిశ, తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులను టీడీపీ నేతలు ఆశ్రయించారు. రాతపూర్వకంగా తిరుపతి వెస్ట్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా దొంగ ఓట్లను పోలీసులకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వివరించారు. తిరుపతిలో 7 వేల దొంగ ఓట్లున్నాయని పోలీసులకు ఆధారాలు చూపించారు రామానాయుడు. దొంగ ఓటర్ల వాయిస్ రికార్డులను పోలీసులకు అందించారు. 229 బూత్‌లో ఒకే ఇంటి చిరునామాతో వాలంటీర్ 22 దొంగ ఓట్లను నమోదు చేయించారని రామానాయుడు పేర్కొన్నారు. 6, 7వ తరగతి చదివిన వారు సర్టిఫికెట్ ఫోర్జరీతో పట్టభద్రుల ఓటు హక్కును పొందారని.. ఒకే డోర్ నెంబర్‌పై 40 దొంగ ఓట్లను ఎలా నమోదు చేశారని తెలిపారు. స్టాంపులను తయారు చేసి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ ఓట్లను నమోదు చేశారని.. వైఎస్సార్‌సీపీ నేతలే దొంగ ఓట్లను నమోదు చేయించారని.. ఎలక్ట్రికల్ ఏఈ ధృవీకరణ సంతకంతో 270 దొంగ ఓట్లను నమోదు చేశారని నిమ్మల రామానాయుడు తెలిపారు.