Tirumala: మొదటి ఘాట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి
తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది.....
దిశ, తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 24 మలుపు వద్ద ఆగి ఉన్న తుఫాన్ వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 15 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతికి రుయా ఆస్పత్రికి తరలించారు