Madanapalle: ఫైల్స్ దగ్ధం కేసులో సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‍కలెక్టరేట్‍లో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దూకుడు పెంచారు...

Update: 2024-07-27 16:16 GMT
Madanapalle: ఫైల్స్ దగ్ధం కేసులో సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‍ కలెక్టరేట్‍లో ఫైల్స్ దగ్ధం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరొకరిని అరెస్ట్ చేశారు. సీటీయం గ్రామ వైసీపీ సర్పంచ్ ఈశ్వరమ్మ భర్త, సీనియర్ జర్నలిస్ట్ అక్కులప్పను పోలీసులు విచారిస్తున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా అక్కులప్ప ఉన్నారు. పలు భూ అక్రమాల్లో అక్కులప్పకు ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. 

Tags:    

Similar News