Tirumala: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది...

Update: 2025-03-17 17:27 GMT
Tirumala: వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల వీఐపీ భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. మార్చి 25న శ్రీవారి కోయిల్ అల్వార్ తిరుమంజనం, మార్చి 30 ఉగాదిన శ్రీవారి ఆస్థానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించింది. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ సైతం రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం వీఐపీ భక్తులు తిరుమల శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలకు భక్తులు భారీగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News