Tirumala: ఇక నుంచి రెండు పూటలా ఫుడ్

టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్‌ను ప్రారంభించారు...

Update: 2023-04-23 10:12 GMT

దిశ, తిరుపతి: టీటీడీ ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలలో సామాన్య భక్తుల సౌకర్యార్థం పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్‌ను ప్రారంభించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ కౌంటరులో ముందుగా శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల పంపిణీని ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్నప్రసాదాలు పంపిణీ చేస్తారు. పీఏసీ-1లో బస చేసే సామాన్య భక్తులకు ఈ ఫుడ్ కౌంటర్ సౌకర్యవంతంగా ఉంటుంది.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంతో పాటు పాత అన్నదానం కాంప్లెక్స్, పీఏసీ-2లో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. వీటితోపాటు రాంభగీచా బస్టాండ్, కేంద్రీయ విచారణ కార్యాలయం వద్ద ఫుడ్‌కౌంటర్లు ఉన్నాయి. దీంతో కలిపి మొత్తం ఫుడ్ కౌంటర్లు మూడుకు చేరాయి. ఈ కార్యక్రమంలో రిసెప్షన్ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్త్రి, ఏఈవో గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News