Yuvagalam: విద్యార్థులతో వాలీబాల్ ఆడిన లోకేశ్ (Video)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 31వరోజు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. ..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 31వరోజు అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా లోకేశ్ పాకాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. గ్రౌండ్‌లో వాలీబాల్ ఆడుతూ లోకేశ్ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం చిన్నారులకు షేక్ హ్యాండ్ ఇస్తూ సరదాగా ముచ్చటించారు.
400 కి.మీ పూర్తి చేసుకున్న పాదయాత్ర
కాగా యువగళం పాదయాత్రలో ఒక్కో మైలురాయిని ప్రగతికి పునాదిరాయిగా నిలిచేలా నారా లోకేశ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువగళం 400 కి.మీ చేరుకున్న సందర్భంగా పాకాల మండలం నరేంద్రకుంట మజిలీలో ఆధునిక వసతులతో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు శిలాఫలకం వేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో నరేంద్రకుంటలో పీహెచ్‌సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటైతే, నరేంద్రకుంట పరిసర ప్రాంత ప్రజల వైద్యం కోసం పడే వ్యయప్రయాసలు తగ్గుతాయని లోకేశ్ అన్నారు.