మంత్రి రోజాపై Nara Lokesh తీవ్ర వ్యాఖ్యలు.. ఆమె ఓ డైమండ్ పాప అంటూ సెటైర్స్

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు....

Update: 2023-02-13 13:41 GMT
  • నగరిని సొంత కుటుంబ సభ్యులకు రాసిచ్చేసింది
  • రోజా భర్తతో కలిసి నగరిలో ఐదుగురు షాడో ఎమ్మెల్యేలున్నారు
  • ల్యాండ్ కబ్జాలు జబర్దస్త్‌గా చేస్తోంది
  • యువగళం పాదయాత్రలో నారా లోకేశ్

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. డైమండ్ పాప అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన రాజకుప్పం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరిగ్ అండ్ టెక్నాలజీ ఎదుట ప్రాంగణంలో జరిగిన బహిరంగసభలో యువనేత లోకేశ్ ప్రసంగించారు. 'జబర్దస్త్ ఆంటీ అని రోజా కోరిక మేరకు పిలుస్తున్నా. ఈ జబర్దస్త్ ఆంటీ నాకు చీర గాజులు ఇస్తానన్నారు. చీర గాజులు వేసుకున్నవాళ్లు చేతకాని వాళ్లా.? నువ్విచ్చే చీర, గాజులు తీసుకురా.. మా అక్క, చెళ్లెల్లకు ఇచ్చి కాళ్లు మొక్కుతా. రోజా నగరికి రానప్పుడు రోజా పరిస్థితి ఏంటి.? అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఎలా మారింది. ఇప్పుడు బెంజ్ కారు..ఊరూరా ఒక విల్లా. చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి. ఈమె బీచ్‌లో నడిస్తే చెప్పులు మోయడానికి మరో ఉద్యోగి. కానీ నగరి ప్రజలకు మిగిలింది మాత్రం గంజినీళ్లు..కన్నీళ్లే' అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయపురం మండలం, శ్రీహరిపురం, కోశలనగరం, పాతార్కాడు గ్రామంలో రోజా డ్రైరెక్షన్‌లో గ్రావెల్ తవ్వి పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రోజా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గ్రానైట్, గ్రావెల్ క్వారీ యజమానులను 40 శాతం వాటా ఇవ్వాలని బెదిరించడంతో వారు కూడా పరారయ్యారని ఎద్దేవా చేశారు. నగరి నియోజవర్గంలోని ఐదు మండలాలను విభజించి సొంత కుటుంబ సభ్యులకు అప్పగించారనిని ధ్వజమెత్తారు. వడమాలపేట, నిండ్ర, పుత్తూరును అన్న రాంప్రసాద్ రెడ్డికి, విజయపురం మండలాన్ని కుమారస్వామిరెడ్డికి, నగరి మండలాన్ని భర్త సెల్వమణి తమ్ముడికి పంచేశారని లోకేశ్ ఆరోపించారు.

నగరిలో టీడీపీ జెండా ఎగరాలి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా భర్తతో కలసి నగరికి ఐదురుగురు షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని లోకేశ్ తెలిపారు. 'ల్యాండ్ కబ్జాలు జబర్దస్త్‌గా చేస్తున్నారు..కోసలనగరం వద్ద 30 ఎకరాలు, వడలమాటపేట టోల్ గేటు వద్ద 55 ఎకరాలు, వైజాగ్ రిషికొండ వద్ద ఎకరా కబ్జా చేశారు. ఇసుక, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పక్కరాష్ట్రాలకు పంపుతున్నారు. రోజాకు ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్ వెళ్లడంపై ఉన్న ఇష్టం..ఇక్కడి మరమగ్గాల వారిపై లేదు. ఇక్కడ చేనేతలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు?.' అని లోకేశ్ ప్రశ్నించారు. 'నగరి నియోజవర్గంలో రెండు సార్లు టీడీపీ గెలవలేదు. మళ్లీ ఇక్కడ గెలవాలి. కష్టపడి పని చేయాలి. ఉత్సాహ వంతుడు గాలి భానుప్రకాశ్‌ను గెలిపించాలి' అని ప్రజలను లోకేశ్ కోరారు

Tags:    

Similar News