Tirumala: ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సర్వం సిద్ధం
నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7న ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరుగనుంది...
దిశ, తిరుమల: నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7న ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరుగనుంది. బుధవారం ఉదయం 6-30 గంటల నుంచి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహంచనున్నారు. ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ. 100 కోట్లతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భూమి పూజ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొననున్నారు.