Tarakaratna హెల్త్ కండీషన్‌పై కీలక అప్‌డేట్
సినీనటుడు తారకరత్న హెల్త్ కండీషన్‌పై కీలక అప్డేట్ వచ్చింది. తారకరత్న రోజు రోజుకు కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పల్స్ రేట్, హార్ట్ బీట్ అంతా నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు...
దిశ, డైనమిక్ బ్యూరో: సినీనటుడు తారకరత్న హెల్త్ కండీషన్‌పై కీలక అప్డేట్ వచ్చింది. తారకరత్న రోజు రోజుకు కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పల్స్ రేట్, హార్ట్ బీట్ అంతా నార్మల్‌గా ఉన్నాయని తెలిపారు. ఆక్సిజన్ లెవెల్ కూడా సరిపడా అందుతున్నట్లు చెప్పారు. వైద్యానికి శరీరంలోని అన్ని అవయవాలు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం బ్రెయిన్‌లో జరిగిన డ్యామేజ్ వల్ల సృహలోకి రావడానికి కొంత సమయం పడుతుందని అటు వైద్యులు చెప్పినట్లు తారకరత్న కుటుంబసభ్యులు తెలిపారు.
కాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన రోజు తారకరత్నకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తారకరత్న బాబాయ్ బాలకృష్ణ స్వయంగా ఆస్పత్రి వద్ద ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అటు తారకరత్న కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెబుతున్నారు. ఇక నందమూరి కుటుంబ సభ్యులు కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రికి వద్దకు వెళ్లి తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. అటు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్‌లో సమస్య వల్ల కోలుకోవటానికి సమయం పడుతుందని తారకరత్నహెల్త్ కండీషన్‌పై కీలక అప్ డేట్ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
నెల్లూరు నుంచే పతనం మొదలైంది.. జగన్‌కు Nara Lokesh హెచ్చరిక