జగన్‌కు మరో షాక్.. ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. ..

Update: 2024-08-05 10:16 GMT

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరోసారి బిగ్ షాక్ తగిలింది. గతంలో ప్రవేశ పెట్టిన ఇసుక విధానంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు సీఐడీ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో ఇసుకను పేదలకు ఉచితంగా ఇవ్వకుండా వైసీపీ నాయకులు అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ప్రతిపక్షంలో చంద్రబాబు సైతం ఇసుక ఆక్రమాలపై విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామని చంద్రబాబు చెప్పారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో జగన్ సర్కార్ చేపట్టిన ఇసుక విధానంపై ఆరా తీసింది. గత ఐదేళ్లపాటు అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో అక్రమాలపై విచారణ జరపాలని సీఐడీని ఆదేశించింది. గత పాలనలో ఇసుక విధానంలో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోని కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంలో అక్రమాలు జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇసుక సరఫరాకు సంబంధించిన ప్రతి లావాదేవి డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు రావొద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అసలు సహించమని హెచ్చరించారు. ఇసుకను ఇష్టమొచ్చినట్లు తవ్వొద్దని, నిబంధనల ప్రకారమే సరఫరా చేయాలని సూచించారు. ఇసుక సరఫరాలో పారదర్శకత చాలా ముఖ్యమని వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు.  

Tags:    

Similar News