Tirumala News:తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా సాధారణంగా ఉన్న భక్తులు ఇప్పుడు స్వల్పంగా పెరిగింది.
దిశ,వెబ్‌డెస్క్:తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత రెండు రోజులుగా సాధారణంగా ఉన్న భక్తులు ఇప్పుడు స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. గురువారం (ఆగస్టు 1) శ్రీవారిని మొత్తం 61 వేల 465 మంది దర్శించుకున్నారు. ఇక శుక్రవారం (ఆగస్టు 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నేడు (ఆదివారం) శ్రీవారి దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 28,246 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చింది.