Tirupatiలో 7 వేల దొంగ ఓట్లు.. కోర్టుకు వెళ్తామని నారాయణ హెచ్చరిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు...

Update: 2023-03-08 12:05 GMT

దిశ, తిరుపతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు నమోదయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో 7 వేల నకిలీ ఓట్లు నమోదు చేశారని మండిపడ్డారు. తిరుపతి యశోదనగర్‌లో ఓ చిన్న ఇంట్లో 11 గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. ఓ మహిళకు 25 మంది భర్తలు ఉన్నట్లు ఓటర్ లిస్టులో ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ బరితెగించిందని ఆయన ఆరోపించారు. చదువు రాని వారిని వేలాది మందిని గ్రాడ్యుయేషన్‌లో చేర్చడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దొంగ ఓట్ల నమోదుపై కోర్టుకు వెళ్తామని నారాయణ హెచ్చరించారు.

Tags:    

Similar News