Tirupati: సీఎంగా కేసీఆర్​ హ్యాట్రిక్ సాధించాలని మొక్కులు

తెలంగాణ సీఎంగా కేసీఆర్​ హ్యాట్రిక్ సాధించాలని కోరుతూ బీఆర్‌ఎస్​నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ...

Update: 2023-07-01 14:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ సీఎంగా కేసీఆర్​ హ్యాట్రిక్ సాధించాలని కోరుతూ బీఆర్‌ఎస్​నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్​ రాష్ట్ర నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ బలోపేతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ విస్తరణకు ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ, వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్​రాష్ట్రంలో నిరంతర పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్​తిరుపతి జిల్లా నాయకులు కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, బెల్లంకొండ సురేష్, జ్ఞానేశ్వరి, సాయి కుమార్, రాజేంద్ర పాల్గొన్నారు.

Tags:    

Similar News