అనుమతి లేకుండా బ్యానర్లు,హోర్డింగులు పెట్టరాదు:అదితి సింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎవరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
దిశ, తిరుపతి:ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎవరు కూడా తమ అనుమతి లేనిదే నగరంలో ఎక్కడ కూడా బ్యానర్లు, పోస్టర్లు, హోర్డింగులు పెట్టరాదని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.తిరుపతి నగరంలో ఇప్పటికే ఏర్పాటు చేసి వున్న అన్ని పోస్టర్లను, బ్యానర్లను తొలగించడం జరిగిందని చెప్పారు.ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ నగరంలో పర్యటిస్తూ నియమ నిబంధనలు పటిష్టంగా అమలుపరిచేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి రిటర్నింగ్ అధికారి, కమిషనర్ అదితి సింగ్ తెలిపారు.
Read More..
ప్రజాప్రతినిధుల పీఏల ఉపసంహరణ..ఎన్నికల కోడ్ నేపథ్యంలో జిల్లాకలెక్టర్ ఉత్తర్వులు