అరెస్ట్ భయంతో బెదిరింపు.. అనూహ్యంగా నిందితుడు మృతి
రాజమండ్రిలో ఒక చోరీ కేసులో పట్టుబడిన నిందితులు అందించిన వివరాల మేరకు విజయవాడ పోలీసులు సూర్య ప్రభాస్ ను అరెస్టు చేయడానికి వేదాంతపురానికి చేరుకున్నారు.
దిశ, తిరుపతి రూరల్: అరెస్టు చేయడానికి దగ్గరకొస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన ఓ నిందితుడు అనూహ్య పరిస్థితుల్లో మరణించిన సంఘటన తిరుపతి రూరల్ వేదాంతపురంలో చోటుచేసుకోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. విజయవాడ కేదారేశ్వరిపేటకు చెందిన సూర్య ప్రభాస్ (21).. భార్య హరిత, నాలుగు నెలలు కుమారుడితో కలిసి వేదాంతపురం గ్రామంలో కాపురం ఉంటున్నాడు.
రాజమండ్రిలో ఒక చోరీ కేసులో పట్టుబడిన నిందితులు అందించిన వివరాల మేరకు విజయవాడ పోలీసులు సూర్య ప్రభాస్ ను అరెస్టు చేయడానికి వేదాంతపురానికి చేరుకున్నారు. పోలీసులను గమనించి నిందితుడు సూర్య ప్రభాస్ ఇంటి తలుపులు వేసుకున్నాడు. పోలీసులను భయపెట్టడానికి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మాహత్యాయత్నం చేశాడు. మంటలు వ్యాపించడంతో అతడి శరీరమంతా కాలిపోయింది. పోలీసులు అతడిని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఎస్సై సాయినాథ్ చౌదరి సంఘటన స్థలానికి చేరుకుని ఘటనకు గల కారణాలు అడిగితెలుసుకున్నారు. సూర్య ప్రభాస్ మృతితో భార్య, కుమారుడు రోడ్డునపడ్డారు.