ఛీ.. మీరు పాలకులా.. సంచలనం రేపుతున్న చంద్రబాబు ట్వీట్

ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కుమారుడి మృతితో తురకా గంగమ్మ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అంబటి కాజెయ్యబోయారంటూ

Update: 2022-12-20 07:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కుమారుడి మృతితో తురకా గంగమ్మ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పరిహారాన్ని మంత్రి అంబటి కాజెయ్యబోయారంటూ వస్తున్న వార్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా స్పందించారు. ఛీ... మీరు పాలకులా అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ కు చంద్రబాబు జతచేశారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News