సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు.. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరిన లుథ్రా
చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూథ్రా ప్రస్తావించారు.
దిశ, వెబ్‌డెస్క్: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూథ్రా ప్రస్తావించారు. ప్రస్తుతం చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారని, అత్యవసరంగా, వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సీజేను లుథ్రా కోరారు. దీనికి స్పందించిన సుప్రీం.. రేపు మరోసారి మెన్షన్ చేయాలని సూచించింది. కాగా, అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవుల నేపథ్యంలో మంగళవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు.
Read More : Chandrababu Naidu: విచారణకు సహకరించడం లేదు : కస్టడీ కోరనున్న సీఐడీ