టికెట్లు వచ్చాయని నిర్లక్ష్యం తగదు! తేడా వచ్చిందో? టీడీపీ అధినేత అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్.

టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ 118 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. గెలుపే లక్ష్యంగా పార్టీలు పనిచేస్తున్నాయి

Update: 2024-02-25 15:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ 118 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు టికెట్లు కేటాయించిన తర్వాత ఆదివారం అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. ఈ క్రమంలోనే దాదాపు 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు వెల్లడించారు.

చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు ఎంతో కీలకమని, ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదన్నారు. టికెట్లు వచ్చాయని క్యాడర్‌తో నిర్లక్యం తగదని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనుకాడబోమని హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికల వరకు ప్రతి వారం సర్వే చేపడతామని, జనసేన కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని తెలిసింది.

వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని ఆయన వివరించారు. కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. ప్రజలకు భవిష్యత్‌పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించాలని, ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామని గుర్తుచేశారు. ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించామని పేర్కొన్నారు. సీఎం జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అన్నింటికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Read More..

తెలుగుదేశం పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం:మాజీ మంత్రి పరిటాల సునీత

Tags:    

Similar News