Free Gas Cylinders : శ్రీకాకుళం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళలకు "దీపం"(Deepam) పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం(AP Govt) ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మహిళలకు "దీపం"(Deepam) పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandrababu Nayudu) నవంబర్ 1న ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం మండలంలో ఈదులపురం నుంచి సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పతకాలు అమలు చేస్తాం అని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అందులో ఒకటి.. ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడం. అర్హులైన ప్రతి కుటుంబంలోని మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ముందు పూర్తి డబ్బులు చెల్లిస్తే.. సిలిండర్ ధర మొత్తాన్ని వారి అకౌంట్లో జమ చేయనున్నారు. కాగా సోమవారం నుంచి ముందస్తు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని కల్పించారు.