సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయటమే పేదరిక నిర్మూలన..చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణ జిల్లా లోని నిమ్మకూరుకు వెళ్లారు.

Update: 2024-01-18 13:12 GMT

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణ జిల్లా లోని నిమ్మకూరుకు వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం నిమ్మకూరు లోని నందమూరి వంశీకులను బంధువులను వాళ్ళ ఇళ్లకు వెళ్లి కలిసిన చంద్రబాబును వాళ్ళు ఆప్యాయంగా పలకరించారు. అనంతరం పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నిజమైన పేదరిక నిర్మూలన అంటే.. సంపదను సృష్టించి.. ఆ సంపదను పేద ప్రజలు అనుభవించేలా చేయడమే అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తాము తీసుకొస్తున్న పూర్ టు రిచ్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అదేనని పేర్కొన్నారు. ఇక మన ఊరి పిల్లలు ప్రపంచవ్యాప్తంగా పని చేసి డబ్బులు సంపాదించడం ఈ ప్రాజెక్టు లో ఓ భాగం మాత్రమే అని తెలిపిన ఆయన.. పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజా సేవ చేశారు అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ఈ ప్రాజెక్ట్ ను చేప్పట్టినట్లు.. అందుకే మొదటగా ఎన్టీఆర్ సొంత ఊరు అయిన నిమ్మకూరులో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సమాజం వల్ల బాగుపడిన ప్రతి ఒక్కరు తమ సొంత ఊర్లో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేలా కార్యక్రమాలు చేపడతామని.. మన ఊర్లో పుట్టిన వారిని మనతో సమానంగా పైకి తీసుకొచ్చే విధంగాప్రభుత్వం, ప్రజలు, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పని చేస్తుందని పేర్కొన్నారు. 

Tags:    

Similar News