AP:‘ఆ విషయంలో చంద్రబాబు కూడా బాధ పడుతున్నారు’..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు వస్తే అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిపిస్తానని కేఏ పాల్ వెల్లడించారు.
దిశ,వెబ్‌డెస్క్:ఏపీ సీఎం చంద్రబాబు గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు వస్తే అనేకమంది పారిశ్రామికవేత్తలను కలిపిస్తానని కేఏ పాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన నేడు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారన్నారు. అక్టోబర్ 2వ తేదీన లాస్ ఏంజెల్స్‌లో గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ జరుపుతున్నామన్నారు. ఈ సమావేశానికి మద్దతివ్వాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరుతున్నామని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక పోతున్నాను. చంద్రబాబు కూడా బాధ పడ్డారన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని ఆయన వెల్లడించారు. రాష్ట్రం కోసం చంద్రబాబుతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి చంద్రబాబుకు సహకరిస్తానన్నారు. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వాలేదని ఫీల్ వేశానని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా వస్తే మనకు రాయతీలు వస్తాయన్నారు. కేంద్రం ఏపీకి ఏం ఇవ్వాలేదని అన్నారు. అమరావతికి 15 కోట్లు అప్పు ఇస్తామంటుంది కానీ అప్పు మనకెందుకు అని కేఏ పాల్ పేర్కొన్నారు.