Chandrababu Naidu : చంద్రబాబు కేసు విచారణ వాయిదా

సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా పడింది. ..

Update: 2023-09-27 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 17(A) ప్రకారం ఎఫ్ఐఆర్లు చెల్లుబాటు కావని సీజేఐ ఎదుట చంద్రబాబు తరఫున న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుపై వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, 17(ఏ) ప్రకారం అవి చెల్లబాటు కావని లూథ్రా వాదనలు వినిపించారు. అటు సీఐడీ తరపున వాదనలు కొనసాగాయి. జీవోలో ఒకటి.. ఒప్పందంలో మరొకటి ఉందని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. స్కామ్‌ను మొదట జీఎస్టీ విభాగం బయటపెట్టిందని, ఆ తర్వాతే కేసు నమోదు అయిందని సీఐడీ లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో కేసు విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 3కు వాయిదా వేసింది. అదే రోజున మరో బెంచ్ ముందుకు లిస్ట్ చేస్తామని సీజేఐ ఆదేశించారు. 

Read More Latest updates of Andhra Pradesh News

Tags:    

Similar News