చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది.

Update: 2023-12-06 11:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. మరోవైపు ఉచిత ఇసుక కేసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ సైతం ఈనెల 12కు వాయిదా వేసింది.

గడువు కోరిన ఏజీ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. నవంబర్‌ 30న విచారణ జరగ్గా చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. నాడు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబు విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని ఏపీ సీఐడీని ఆదేశించింది. అదే సమయంలో సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ గడువు కోరారు. దీంతో విచారణను డిసెంబర్ 6కు హైకోర్టు వాయిదా వేసింది. బుధవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 12కు వాయిదా వేసింది.

Tags:    

Similar News