BCలకు 50 శాతం రిజర్వేషన్లపై చేతులెత్తేసిన కేంద్రం

విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్‌ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు...

Update: 2022-12-14 10:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్‌ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని సుదీర్ఘకాలంగా వస్తున్న న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకున్న పక్షంలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అంటూ వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేష్‌ కల్పించాలంటూ దేశం వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నట్లుగా కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్‌ తెలిపారు.

Tags:    

Similar News