Census: జనగణనలో ఈ ప్రశ్నలు చేర్చండి.. అమిత్ షాకు విజయసాయిరెడ్డి రిక్వెస్ట్

జనగణన(Census)లో కులగణన(Caste Census)పై రెండు లేదా మూడు ప్రశ్నలు చేర్చాలని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి(YCP leader Vijayasai Reddy) కోరారు.

Update: 2024-11-10 18:19 GMT

దిశ, వెబ్ డెస్క్: జనగణన(Census)లో కులగణన(Caste Census)పై రెండు లేదా మూడు ప్రశ్నలు చేర్చాలని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి(YCP leader Vijayasai Reddy) కోరారు. జనగణనపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah)ను కీలక రిక్వెస్ట్(Request) చేశారు. ఈ సందర్భంగా.. రాబోయే సాధారణ జనాభా గణనలో సామాజిక-ఆర్థిక కుల గణన(Socio-Economic Caste Census) (SECC)ని చేర్చాలని అమిత్ షాను కోరారు. కేవలం రెండు లేదా మూడు ప్రశ్నలను జోడించడం ద్వారా, ఈ ఏకీకరణను సజావుగా, సమర్ధవంతంగా సాధించవచ్చని తెలిపారు. సెన్సస్‌తో పాటు సామాజిక-ఆర్థిక కుల గణన నిర్వహించడం వల్ల సమయం, వనరులు ఆదా అవుతాయని సూచించారు. అలాగే దీని వల్ల సామాజిక-ఆర్థిక వాస్తవాల(Socio-Economic Realities)ను బాగా అంచనా వేయడానికి.. తదుపరి లక్ష్యాలను, భవిష్యత్తు కేంద్రీకృత విధానాలను ప్లాన్ చేయడానికి ప్రభుత్వాలకు కూడా అధికారం లభిస్తుందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News