Case Filed: ఎన్నికల వేళ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి షాక్.. ఆ విషయంలో కేసు నమోదు

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో నిమగ్నమైన వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి షాక్ తగిలింది.

Update: 2024-04-11 03:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో నిమగ్నమైన వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. 144 సెక్షన్‌ను అతిక్రమించి మంగళవారం వైసీపీ అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ మేరకు కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు గాను సెక్షన్ 427 కింద పేర్ని నానితో పాటు మరికొంత మందిపై కేసు ఫైల్ అయింది. 

Tags:    

Similar News