Budameru Flood:సింగ్‌నగర్ సేఫ్..తగ్గుముఖం పట్టిన బుడమేరు వరద

గత వారం రోజుల నుంచి ఏపీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.

Update: 2024-09-07 08:22 GMT

దిశ,వెబ్‌డెస్క్:గత వారం రోజుల నుంచి ఏపీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక విజయవాడ(Vijayawada)లో వరద(Floods) బీభత్సం సృష్టించింది. ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వరద నీరు రావడానికి కారణమైన బుడమేరు (Budameru Flood) వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ(Vijayawada)లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. వరదలతో బెజవాడ వాసుల కష్టాలు వర్ణనాతీతం. భారీ వరదలతో(Floods) వేలాది మంది తమ తమ నివాసాలు వదలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ సింగ్‌నగర్‌(Singhnagar)లో బుడమేరు (Budameru) వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో వరద నీరు వచ్చిన ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. వరద నీరు వెళ్లిపోయిన ప్రాంతాల్లో క్లీనింగ్(Cleaning) కార్యక్రమం ఊపందుకుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల కిట్‌ను MDU వాహనాల ద్వారా వదర బాధితులకు ప్రభుత్వం అందజేస్తోంది.


Similar News