నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో బీఆర్ఎస్ ముఖ్యనేత భేటీ.. నిరసనలకు సంఘీభావం
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుటుంబానికి
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ మద్దతు తెలిపారు. తాజాగా రాజమండ్రిలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణితో ఆయన భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తన సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ఆందోళనలు ఎందుకని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి.కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యనేత స్వయంగా చంద్రబాబు కుటుంబసభ్యులను కలిసి మద్దతు తెలపడం కీలకంగా మారింది.
ఈ సందర్భంగా బండి రమేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబసభ్యులను కలిసి సంఘీభావం ప్రకటించేందుకు రాజమండ్రికి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు గొప్ప నేత అని, ఆయనపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని రమేష్ ఆశించారు. తెలుగు ప్రజల కోసం చంద్రబాబు తన జీవితాన్ని దారబోశారని వ్యాఖ్యానించారు. కాాగా చంద్రబాబు అరెస్ట్‌ను ఇప్పటికే తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఖండించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు వంటి నేతలు తప్పుబట్టారు.