BREAKING: ఏపీ ఎన్నికల్లో హింసపై సిట్ తుది నివేదిక.. సంచలన విషయాలు వెలుగులోకి

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసపై సిట్‌ తన తుది నివేదకను డీజీపీ కార్యాలయానికి సమర్పించింది.

Update: 2024-06-11 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన హింసపై సిట్‌ తన తుది నివేదకను డీజీపీ కార్యాలయానికి సమర్పించింది. ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 11 మంది అధికారులతో సిట్‌ను ఎన్నికల సంఘం నియమించగా.. వారు 264 పేజీలతో రెండు భాగాలుగా నివేదికను రూపొందించారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనలపై 37 కేసులు నమోదు చేసినట్లు సిట్‌ తన నివేదికలో వెల్లడించింది. 6 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు, ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులు రెండు ఉన్నట్లు పేర్కొంది. పల్నాడు జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదని అభిప్రాయపడింది.

అదేవిధంగా కొన్ని సంచలన విషయాలను కూడా సిట్ వెలుగులోకి తీసుకొచ్చింది. అల్లర్లకు ప్రధాన కారణం పోలీసుల నిండా నిర్లక్ష్యమేనని సిట్ నివేదికలో వెల్లడించింది. పల్నాడు అల్లర్లను పోలీసులు ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోలేదని తెలిపింది. తాడిపత్రిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఆందోళనకారులు బైక్ ర్యాలీ నిర్వహించిందని పేర్కొంది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులోనూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిట్ వెల్లడించింది. అల్లర్లలో గాయపడిన బాధాతుల మెడికల్ రిపోర్టులను సైతం సేకరించకుండా పోలీసులు అశ్రద్ధంగా వ్యవహరించారని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయని, జరిగిన అల్లర్లతో పోలీస్ శాఖపై పూర్తి నమ్మకం పోయిందని సిట్ తన నివేదికలో వెల్లడించింది.


Similar News