BREAKING: తూర్పు గోదావరి జిల్లా జగన్నాథపురంలో పోలీసుల తనిఖీలు.. ప్రైవేటు ట్రావెల్స్‌లో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదు సీజ్

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

Update: 2024-05-02 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాథపురం అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న శ్రీ వీరాంజనేయ ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం.. అది ఎవరిదై ఉండొచ్చనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Read More..

AP Politics:మధ్యతరగతి ప్రజల కోసం ప్రత్యేక హౌసింగ్ స్కీమ్ తీసుకువస్తాం:టీడీపీ అభ్యర్థి 

Tags:    

Similar News