BREAKING: ఎన్నికల వ్యూహాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. గెలుపు కోసం పక్కా ప్లాన్!

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ పక్కగా వ్యూహ రచన చేస్తున్నారు.

Update: 2024-03-21 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ పక్కగా వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నిత్యం ప్రజల్లో ఉండేందుకు బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే నేడు కడప జిల్లా నేతలతో వైసీపీ అధినేత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బస్సు‌యాత్రలో వ్యవహరించాల్సి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మీటింగ్‌లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించనున్నారు.

కాగా, ఈ నెల 27 నుంచి జగన్‌ బస్సుయాత్ర చేపట్టబోతున్నారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కి నివాళులర్పించి అదే రోజు ప్రొద్దుటూరులో యాత్రలో పాల్గొననున్నారు. 28న నంద్యాలలో ‘సిద్ధం’ సభను నిర్వహించబోతున్నారు. ఇక 30న ఎమ్మిగనూరులో బహిరంగ సభ నిర్వహించేలా పార్టీ ప్లాన్ చేసింది. పాదయాత్ర తరహాలోనే జగన్ ఇకపై పూర్తిగా జనాల్లోనే ఉండబోతున్నారు. సిద్ధం సభలు జరిగిన నియోజకవర్గాలు మినహా రాష్ట్రమంతా జగన్‌ బస్సుయాత్రను చేపట్టున్నారు.  

Read More..

Breaking: ఆ రోజే వైసీపీ మేనిఫెస్టో విడుదల

Tags:    

Similar News