BREAKING: చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. నరేంద్ర మోడీ నెట్టలేరు: మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనుంది.

Update: 2024-03-15 05:18 GMT
BREAKING: చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. నరేంద్ర మోడీ నెట్టలేరు: మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లోనే వెలువడనుంది. ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూటమిపై సెటైర్ల పేల్చారు. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు.. మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించే మోసగాడని అన్నారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని.. రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. సీఎం జగన్ ఎవరికీ తలవంచే వ్యక్తి కాదని.. ఎంతటి వారినైనా ఎదర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడని అభివర్ణించారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా నెరవేర్చిన ఘటన ఆయనకు దక్కుతుందని మంత్రి అంబటి అన్నారు. 

Read More..

పవన్ కల్యాణ్‌పై పోటీ.. దెబ్బకు రామ్ గోపాల్ వర్మ యూటర్న్  

Tags:    

Similar News