BREAKING: అధికార పార్టీకి బిగ్ షాక్.. బీజేపీలో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే, ముహూర్తం ఫిక్స్
ఆంధ్రా రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తుండటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు జంపింగ్స్‌కు తెర లేపారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమీపిస్తుండటంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతలు జంపింగ్స్‌కు తెర లేపారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా.. అధికారం చేజిక్కించుకోవాలని అన్ని ప్రధాన పార్టీలు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై పార్టీల అధినేతలు ఇప్పటికే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా చంద్రబాబు, వపన్ కల్యాణ్‌లు 118 మందితో కూడిన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
అదేవిధంగా సీఎం జగన్ ఆయా నియోజకవర్గాల్లో ప్రజా వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను పక్కకు పెట్టి కొత్త అభ్యర్థులకు నియోజకవర్గాల బాధ్యతలను అప్పజెప్పారు. దీంతో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగురవేశారు. వారంతా వేరే పార్టీల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార వైపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఐదేళ్ల పాటు పార్టీలో సీఎం ఆదేశాల మేరకు పని చేసినా.. పార్టీ తనకు టికెట్ నిరాకరించడంపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు విజయవాడలో జరగుతున్న బీజేపీ లోక్‌సభ కోర్ కమిటీ భేటీ జరుగుతున్న హోటల్‌కు కాపు రామచంద్రా రెడ్డి వెళ్లారు. ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిని కలిశారు. అదేవిధంగా మరి కొంతమంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కాపు రామచంద్రా రెడ్డి మీడియాకు తెలిపారు.