బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుచరుడి అరెస్ట్
వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్ వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా మర్డర్ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఉదయ్‌ను సీబీఐ తరలించింది. అయితే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి తుమ్మల పల్లి యురేనియం కర్మాగారంలో పనిచేస్తున్నాడు. వివేకా హత్య రోజు అవినాష్, శివశంకర్ తో పాటు ఉదయ్ ఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఉదయ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. కాగా గతంలో పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ విచారించింది.
Read more: