BREAKING: మాజీ సీఎం జగన్‌కు క్లాస్ పీకిన ఉండవల్లి అరుణ కుమార్.. మొదట ఆ పని చేయండని సలహా

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నారు.

Update: 2024-06-14 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీకే సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు, గూండాగరీ ఆ పార్టీకి ఓటమికి ప్రధాన కారణం అయ్యాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు బలం పుజుకున్నాయని తాను వైసీపీ నాయకులను, అధినేత జగన్‌ను హెచ్చరించానని గుర్తు చేశారు. తీర ఫలితాలు చూసి వైసీపీ నాయకులు నోళ్లు వెళ్లబెట్టారని, తాను మాత్రం ఏమాత్రం ఆశ్చర్యానికి గురి కాలేదని అన్నారు. అనుకున్నట్లుగానే కూటమి 164 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుందని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ఎక్కడా లేదని మాజీ సీఎం జగన్‌కు ఆయన ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. వచ్చే ఎన్నికల్లోపూ ఇప్పటి నుంచి అయినా పార్టీని బిల్ట్‌అప్ చేసుకోవాలని ముందు దానిపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. వైసీపీలో ఉన్న ఏ ఒక్కరికి సబ్జెక్ట్‌పై అవగాహన లేదని కేవలం బూతులు మాట్లాడుతూ.. కాలం గిడిపేశారని, ముందుగా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వండి అటూ హితవు పలికారు. సరిహద్దు గొడవల్లాగా శాసనసభలో, ప్రెస్‌మీట్లలో ఎక్కడ పడితే అక్కడ బూతలు మాట్లాడటం మానెయ్యాలని సూచించారు. వైసీపీ నాయకులు పూర్తిగా వలంటీర్లపైనే డిపెండ్ అయ్యారని, వాళ్లుకు చంద్రబాబు జీతం ఎక్కువగా ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇస్తే.. వాళ్లెందుకు వైసీపీకి ఓట్లు వేయిస్తారని కామెంట్ చేశారు.   

Also Read...

BREAKING: వైసీపీ అధికారం కోల్పోయింది ఆ ఎఫెక్ట్‌తోనే : ఉండవల్లి అరుణ కుమార్ సంచలన వ్యాఖ్యలు



Similar News