Breaking : అచ్యుతాపురం రియాక్టర్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

Update: 2024-08-22 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనకాపల్లిలోని ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారికి 2 లక్షల రూపాయలు అలాగే క్షతగాత్రులకు 50,000 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరమని,పేలుడులో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

కాగా.. రియాక్టర్ పేలుడు తర్వాత సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది మరణించారని సుమారు 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ముఖ్యమంత్రి గురువారం పరామర్శించనున్నారు.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Similar News