బిగ్ బ్రేకింగ్: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు బిగ్ షాక్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇవాళ్టితో చంద్రబాబు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియగా.. విజయవాడ ఏసీబీ కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసులో ఇవాళ్టితో చంద్రబాబు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ముగియగా.. విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడగించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఇవాళ మరో భారీ షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియగా.. కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
సీఐడీ తరుఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది. పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏక వాక్యంతో కోర్టు తీర్పునిచ్చింది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ తనకు విధించిన రిమాండ్ చెల్లదని చంద్రబాబు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ కీలక తీర్పును వెలువరించింది.