BIG News: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ 7 నుంచి వైన్స్ షాపులు బంద్

మందుబాబుకు మరో బ్యాడ్‌ న్యూస్ తగిలింది. ఈ మేరకు సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు.

Update: 2024-08-31 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: మందుబాబుకు మరో బ్యాడ్‌ న్యూస్ తగిలింది. ఈ మేరకు సెప్టెంబర్ 7 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రకటించారు. తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వారంతా ఇటీవలే చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ తమను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసిందని ఉద్యోగులు పేర్కొన్నారు. కానీ, మళ్లీ తమ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వస్తే రాష్ట్రంలోని 15 వేల మంది కాంట్రెక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడతారని ఉద్యోగులు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తమ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 7 నుంచి మద్యం దుకాణాలు మూసివేయాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. కాగా, అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.


Similar News