బ్రేకింగ్ : వివేకా హత్య కేసు : సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2023-03-29 09:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరిగింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 30 లోగా విచారణను పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. కుట్ర ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని సూచించింది. విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ 5 శివశంకర్ రెడ్డి బెయిల్‌ మంజూరు చేయాలని తులసమ్మ కోరగా పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.  ఏప్రిల్ 15 కల్లా వివేకా హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి: Anantapur: వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్య

Tags:    

Similar News