BIG BREAKING: రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది గంటల్లోనే పోలింగ్.. జగన్‌కు ఎన్ని సీట్లొస్తాయో చెప్పిన ప్రశాంత్ కిషోర్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనబడుతోంది. బతుకుదెరువు కోసం దేశంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లక క్యూ కట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కనబడుతోంది. బతుకుదెరువు కోసం దేశంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లక క్యూ కట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో వస్తారోనని సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు తమదేనంటూ స్టేట్‌మెంట్ ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇవాళ ఓ తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీకి సారథ్యం వహిస్తున్న జగన్‌కు ఎన్ని సీట్లు వస్తాయో తేల్చి చెప్పాడు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం ఖాయమని రావడం ఖాయమని అన్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లకు పైగా సాధించిన వైసీపీ ప్రస్తుతం 51 సీట్లు కూడా దాటవని కామెంట్ చేశారు. కూటమికి అనుకూలంగా వచ్చే ఓట్ల కంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ ఉండబోతుందని పీకే కుండ బద్దలు కొట్టాడు. తాను ఐ-ప్యాక్‌తో ఉన్నపుడు 2019లో వైసీపీకి పని చేశానని, అప్పుడు ఆ పార్టీకి నవ రత్నాలు అనే స్కీమ్స్ డిజైన్ చేశానని తెలిపారు. అక్కడితో తన పని అయిపోయిందని, తరువాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ సీఎం అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని పీకే తెలిపారు. జగన్ గెలుపు కోసం అప్పట్లో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రాష్ట్రమంతా తిరిగారని, ఇప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయన కోల్పోయాడని అన్నారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయని పీకే పేర్కొన్నారు.